logo

వైకాపా నాయకుల అక్రమ కట్టడాల కూల్చివేత

వైకాపా నేతలు మున్సిపాలిటీలోని మాచవరం జాతీయ రహదారి పక్కనే ఆక్రమించిన రూ. రూ. 7కోట్ల విలువ చేసే అయిదు ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ లభించింది.

Published : 23 Jun 2024 02:44 IST

యంత్రం సాయంతో కూల్చివేస్తున్న ప్రహరీ  

కనిగిరి, న్యూస్‌టుడే: వైకాపా నేతలు మున్సిపాలిటీలోని మాచవరం జాతీయ రహదారి పక్కనే ఆక్రమించిన రూ. రూ. 7కోట్ల విలువ చేసే అయిదు ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ లభించింది. వైకాపా నేతల చెరలో ప్రభుత్వ భూములు శీర్షికన శుక్రవారం సంచికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కనిగిరి ఆర్డీవో పి.జాన్‌ ఇర్విన్, మున్సిపల్‌ కమిషనర్‌ రంగారావు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇనుప కంచెను తొలగింపజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాచవరం సమీపంలోని 634-ఏ, 634-బి సర్వే నంబర్లలో రోడ్డు పోరంబోకు, డొంక పోరంబోకులో ఈ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం గోడలు, ఫెన్సింగ్, తొలగించామన్నారు. పిల్లర్‌్్స వేసిన స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయంగా ఉయోగించుకుంటామన్నారు. 

‘ఈనాడు’కు గ్రామస్థుల కృతజ్ఞతలు : సుమారు రూ. 7 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతంపై ‘ఈనాడు’లో ప్రచురించి తమకు సమగ్ర సమాచారం ఇవ్వడంతో చర్యలు చేపట్టామని కమిషనర్‌ టీవీ రంగారావు అన్నారు. ఈ మేరకు ఆయనతో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని