logo

ప్రభుత్వం మారినా.. పాత వాసనే

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలను తొలగించారు.

Published : 23 Jun 2024 02:45 IST

ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌  వెబ్‌సైట్‌లో  రాజీనామా చేసిన ఛైర్మన్‌ చిత్రం 

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలను తొలగించారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయి ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే నేటికీ పలు శాఖËల వెబ్‌సైట్‌లలో అధికారుల చిత్రాలు, వారి వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఛైర్మన్‌గా రాజీనామా చేసి, పలు ఆరోపణలు ఎదుర్కొన్న కె.హేమచంద్రారెడ్డి చిత్రం దర్శనమిస్తోంది. సాంఘిక సంక్షేమ, ప్రకృతి విపత్తుల, ఆగ్నిమాపక, రవాణా, పురపాలక, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వెబ్‌సైట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల చిత్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని