logo

అసెంబ్లీలో నా సీటే జగన్‌కిచ్చినా..కూర్చోలేకపోయారు

జగన్‌ పాపం పండింది..చేసిన అరాచకాలతో ఆయన శాసనసభలోనూ కూర్చోకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.

Published : 23 Jun 2024 02:47 IST

మంత్రి స్వామి ఎద్దేవా 

ప్రసంగిస్తున్న మంత్రి స్వామి, చిత్రంలో దామచర్ల సత్య తదితరులు

టంగుటూరు, న్యూస్‌టుడే: జగన్‌ పాపం పండింది..చేసిన అరాచకాలతో ఆయన శాసనసభలోనూ కూర్చోకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరు మండల తెదేపా ఆధ్వర్యంలో మంత్రి స్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యలకు పౌర సన్మాన కార్యక్రమాన్ని స్థానిక మసీదు సెంటర్‌లో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభలో తాను కూర్చొని పోరాటం చేసిన కుర్చీలోనే జగన్‌ను కూర్చొబెట్టారు. ప్రమాణ స్వీకారం చేశాక ఆ కుర్చీలో కూడా కూర్చొకుండానే ఆయన బయటకు వెళ్లిపోయారన్నారు. ఎన్నో ఏళ్లుగా కొండపి ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు.. వారికి  శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సత్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా తమ  కుటుంబం అండగా నిలుస్తుందన్నారు. అనంతరం మండలంలోని నాయకులు పూలమాలలను వేసి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కామని విజయ్‌కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయంత్‌బాబు, మక్కెన వెంకటరావు, అడకా స్వాములు, మద్దిరాల మమత, రాము, బాలకోటయ్య, తోకల భారతి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని