logo

అభయమివ్వుమా.. ఆంజనేయా...

హనుమాన్‌ విజయ శోభాయాత్రను విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో పామూరులో శనివారం నిర్వహించారు. తొలుత పూజలు చేసి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్‌పై కొలువుదీర్చారు.

Published : 23 Jun 2024 03:02 IST

ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి విగ్రహం

పామూరు, న్యూస్‌టుడే: హనుమాన్‌ విజయ శోభాయాత్రను విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో పామూరులో శనివారం నిర్వహించారు. తొలుత పూజలు చేసి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్‌పై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, డప్పుల వాయిద్యాలు, బాణసంచా కాల్పులు, కోలాట నృత్యాలు, భక్తుల కేరింతల మధ్య ఊరేగించారు.జాతీయ పతాకం, ఆంజనేయస్వామి జెండాను చేతబూని యువత సందడి చేశారు. భక్తులు సింధూరం రంగులో ఉన్న తలపాగాలు, కండువాలు ధరించి  పాల్గొన్నారు. ఆద్యంతం జైశ్రీరామ్, జై హనుమాన్‌ అంటూ చేసిన నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. 

యాత్రలో కోలాటం ప్రదర్శిస్తున్న మహిళలు.. చిత్రంలో వీహెచ్‌పీ, భజరంగదళ్‌ సభ్యులు, భక్తులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు