logo

గొట్టిపాటి.. అమాత్యునిగా కొలువుదీరి

రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రిగా బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వెలగపూడిలోని సచివాలయంలో శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 23 Jun 2024 03:02 IST

ఈనాడు, ఒంగోలు : రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రిగా బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వెలగపూడిలోని సచివాలయంలో శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. గొట్టిపాటిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్‌ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, నేతలు దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని