logo

నగరం పలికే నీరాజనం

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్‌ అసెంబ్లీలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తొలిసారిగా ఆయన శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

Published : 23 Jun 2024 03:03 IST

గజమాలతో దామచర్లకు స్వాగతం.. చిత్రంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్‌ అసెంబ్లీలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తొలిసారిగా ఆయన శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నగర వాసులు ఘన స్వాగతం పలికారు. త్రోవగుంట, ఉత్తర బైపాస్‌లోని మంగమ్మ కళాశాల జంక్షన్‌ వద్ద తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌తో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు పైవంతెన నుంచి ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్‌ సెంటర్, ట్రంక్‌రోడ్డు, కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్‌ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. తెలుగు మహిళలు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని