logo

పట్టాలెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

దర్శి ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చోదక, పరిశోధనా పాఠశాల (ఐడీటీఆర్‌) నిర్మాణం ప్రారంభించారు. ట్రాక్‌ ఏర్పాటుకు కొండ ప్రాంతాన్ని చదును చేసి పరిపాలనా భవనాల నిర్మాణం చేపట్టే సమయంలో ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి వచ్చింది.

Published : 24 Jun 2024 05:05 IST

చంద్రన్న రాకతో చోదక పాఠశాల నిర్మాణానికి అనుమతి

ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో ఏర్పాటుచేసిన శిలాఫలకం

దర్శి, న్యూస్‌టుడే: దర్శి ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చోదక, పరిశోధనా పాఠశాల (ఐడీటీఆర్‌) నిర్మాణం ప్రారంభించారు. ట్రాక్‌ ఏర్పాటుకు కొండ ప్రాంతాన్ని చదును చేసి పరిపాలనా భవనాల నిర్మాణం చేపట్టే సమయంలో ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పాఠశాల నిర్మాణంపై ప్రజల ఆశలు పెరిగాయి. దీనికి తగ్గట్లు రాష్ట్ర రవాణాశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్‌రెడ్డి తన తొలి సంతకాన్ని చోదకులకు శిక్షణ ఇచ్చే ఫైల్‌పై చేశారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా దర్శిలో చేపట్టిన ఐడీటీఆర్‌ తిరిగి ప్రారంభించేందుకు మంత్రి అనుమతించారు. రూ.18.5 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. ఆ నిధులు విడుదల చేయటం ద్వారా తిరిగి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని