logo

పోలీసులూ.. శభాష్‌

చీరాల మండలం ఈపూరుపాలెం మహిళ హత్య కేసులో నిందితులను సత్వరం అదుపులోకి తీసుకోవడంపై తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వారి అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

Published : 24 Jun 2024 05:08 IST

చీరాల హత్యకేసు నిందితుల పట్టివేతతో ఆనందం

సమావేశంలో మాట్లాడుతున్న తెలుగు మహిళలు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల మండలం ఈపూరుపాలెం మహిళ హత్య కేసులో నిందితులను సత్వరం అదుపులోకి తీసుకోవడంపై తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వారి అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ మేరకు ఒంగోలు తెదేపా కార్యాలయంలో ఆదివారం తెలుగు మహిళలు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా హత్యకు గురైన మహిళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కొందరు యువకులు మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 48 గంటల్లో పట్టుకోవాలని, ఘటనా స్థలానికి హోంమంత్రి అనితను వెళ్లాలంటూ ఆదేశించడం వల్ల పోలీసులు చురుగ్గా వ్యవహరించారన్నారు. అనుకున్నట్లే 36 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోవడం చంద్రబాబునాయుడు పాలనా దక్షతకు నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో తెదేపా చూపుతున్న చొరవ సంతోషదాయకమన్నారు. గత ప్రభుత్వంలో దిశా దశ లేని చట్టాన్ని తీసుకొచ్చి మహిళలను మోసం చేశారని, ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదని విమర్శించారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించినందుకు చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు రావుల పద్మజ, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి బీరం అరుణారెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి టి.అనంతమ్మ, ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమానూరి పావని, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని