logo

మళ్లీ వాయిదానా..!

ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశపరీక్ష వాయిదాతో వైద్య విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరుసటి రోజు పరీక్ష నిర్వహిస్తారనగా, వాయిదా వేసినట్లు ప్రకటించడంతో వారిలో నైరాశ్యం అలముకుంది.

Updated : 24 Jun 2024 05:55 IST

నీట్‌ పీజీ పరీక్ష నిలిచిపోవడంతో నైరాశ్యం
పరీక్ష కేంద్రాలకు వెళ్లి..వెనుదిరిగిన మెడికోలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశపరీక్ష వాయిదాతో వైద్య విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరుసటి రోజు పరీక్ష నిర్వహిస్తారనగా, వాయిదా వేసినట్లు ప్రకటించడంతో వారిలో నైరాశ్యం అలముకుంది. జిల్లాకు సంబంధించి స్థానిక రైజ్‌ ప్రకాశం కళాశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేశారు. మొత్తం 240 మంది విద్యార్థులను ఈ కేంద్రానికి కేటాయించారు. వివిధ జిల్లాలకు చెందిన వారికి కూడా ఈ కేంద్రాన్నే కేటాయించడంతో వారంతా శనివారం నాడే  నగరానికి చేరుకున్నారు. పరీక్ష వాయిదా విషయం తెలుసుకొని నీరుగారిపోయారు. ఈ వార్త నిజమోకాదో నన్న అనుమానంతో పలువురు తల్లిదండ్రులతో కలసి కేంద్రం వద్దకు వెళ్లి విషయం తెలుసుకొని వెనుతిరిగారు. నీట్‌ యూజీ పరీక్షలు గందరగోళంగా తయారైన నేపథ్యంలో పీజీ పరీక్ష సజావుగా జరుగుతుందని ఆశించారు. చివరికి అది మూడోసారి తేదీలు మారిపోయాయి. దీనితో పరీక్షకు సిద్ధమైన విద్యార్థులు అయోమయంలో పడ్డారు. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. సకాలంలో జరపకపోతే తమ భవిష్యత్తు ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జులై మొదటి వారంలోపు పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని