logo

బాలినేని అక్రమాలపై విచారణకు డిమాండ్‌

గత అయిదేళ్ల కాలంలో వైకాపా నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 24 Jun 2024 05:27 IST

 

మాట్లాడుతున్న వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పక్కన వివిధ సంఘాల ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: గత అయిదేళ్ల కాలంలో వైకాపా నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని ఆచార్య రంగా భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు... విశ్రాంత ఏఎస్పీ సుంకర సాయిబాబు, సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షుడు కంచెర్ల సుబ్బారావు, న్యాయవాది దేవకుమారి మాట్లాడారు. బాలినేని అనుచరులు భూకబ్జాలకు పాల్పడి, దొంగ రిజస్ట్రేషన్లతో నగరంలో భయానక వాతావరణం సృష్టించారన్నారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.  బాలినేని వియ్యంకుడు నిర్మించిన విల్లాల స్థలంలో చదను కోసం రూ.కోట్లు విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తరలించారన్నారు. వాగు పోరంబోకును సైతం కలుపుకొన్నారని... దీనిపై విచారణ జరపాలని కోరారు. ఇటీవల చీరాలలో బాలిక అత్యాచారం, హత్య ఘటనలో దోషులను వెంటనే పట్టుకోవడం నూతన ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని