logo

రథోత్సవం... మురిసిన భక్తజనం

పాత సింగరాయకొండలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.

Published : 24 Jun 2024 05:32 IST

పాత సింగరాయకొండలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. వేదపండితులు ప్రతి ఘట్టం ప్రాధాన్యాన్ని వివరిస్తూ క్రతువు నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జడ్పీ ఉపాధ్యక్షురాలు అరుణ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన రథోత్సవం... మేళతాళాలు, సాంస్కృతిక సంబరాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య వైభవంగా సాగింది. రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సింగరాయకొండ, కొండపి సీఐలు రంగనాథ్, పాండురంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని