logo

లీజు రద్దుకు లేఖ రాశాం..: మోహిత్‌ రెడ్డి

ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని తాము పారదర్శకంగానే కేటాయించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ‘ఈనాడు’లో ఈ నెల 24న ప్రచురితమైన ‘ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా’ కథనానికి వారు స్పందించారు.

Published : 26 Jun 2024 01:34 IST

ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని తాము పారదర్శకంగానే కేటాయించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ‘ఈనాడు’లో ఈ నెల 24న ప్రచురితమైన ‘ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా’ కథనానికి వారు స్పందించారు. గతంలో రెండుసార్లు టెండర్లు వేసినా బిడ్‌ కోట్‌ చేసిన ఇతరులు వెనక్కు తగ్గడంతో సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీతో చర్చలు సాగించి స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వివాదంపై వైకాపా  నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహత్‌రెడ్డి స్పందించారు. తాము చట్టబద్ధంగానే ఒంగోలు, అద్దంకి, తెనాలి డిపోల్లో స్థలాలకు టెండర్‌ కోట్‌ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో ఒంగోలు స్థలం విషయంలో లీజు రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని