logo

‘టెట్‌’లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

టీచర్స్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (టెట్‌) ఫలితాలను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో టెట్‌ పరీక్ష నిర్వహించగా, జిల్లాలో సుమారు ఆరువేల మంది రాశారు.

Published : 26 Jun 2024 01:35 IST

పి.ఎస్తేరమ్మ, 137.10 మార్కులు, ఐ.మౌనిక, 129.7 మార్కులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: టీచర్స్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (టెట్‌) ఫలితాలను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో టెట్‌ పరీక్ష నిర్వహించగా, జిల్లాలో సుమారు ఆరువేల మంది రాశారు. డీఎస్సీ నిర్వహించేలోపు ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఫలితాలను వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించి పోస్టులు భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా టెట్‌ ఫలితాలు విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షలోపు మరోసారి టెట్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకసారి టెట్‌ రాసిన వారు ఎన్నిసార్లు అయినా డీఎస్సీ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు పేపర్‌-1ఎ (ఎస్జీటీ కేటగిరి)లో మెరుగైన మార్కులు సాధించారు. కోడూరివారిపాలేనికి చెందిన పి.ఎస్తేరమ్మ మొత్తం 150 కి 137.10 మార్కులు సాధించగా, కరవదికి చెందిన ఐ.మౌనిక 129.7 మార్కులు కైవసం చేసుకుంది. అదే విధంగా పేర్నమిట్టకు చెందిన కె.అంజమ్మ 125.6 మార్కులు పొందింది. వీరు నగరంలోని వికాస్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందారని సంస్థ కరస్పాండెంట్‌ కె.మోహన్‌రావు, డైరెక్టర్‌ పి.వీరయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని