logo

1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తిన్న మాజీ మంత్రి

‘మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి ఒంగోలులో చేపట్టిన నిర్మాణ ప్రాజెక్ట్‌ భూముల్లో అక్రమాలున్నాయి.

Updated : 11 Jul 2024 06:34 IST

ప్రాజెక్ట్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరిస్తున్న సుబ్బారావు గుప్తా

ఒంగోలు, న్యూస్‌టుడే: ‘మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి ఒంగోలులో చేపట్టిన నిర్మాణ ప్రాజెక్ట్‌ భూముల్లో అక్రమాలున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేస్తా’ అని తెదేపా నాయకుడు, ఆర్యవైశ్య రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలినేని కుటుంబం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ భూములకు కొణిజేడు కొండల నుంచి 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అక్రమంగా వినియోగించారని గుప్తా చెప్పారు. ఇది ఇనుప ఖనిజమున్న మట్టి కావడంతో దాని విలువ రూ.699 కోట్లు ఉంటుందని వివరించారు. బాలినేని కుటుంబీకులు అయిదేళ్లపాటు సాగించిన అక్రమాలకు గనుల శాఖ అధికారి ఒకరు సహకరించారని, ఆయన జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. చీమకుర్తి, బల్లికురవ గనుల్లోనూ మాజీ మంత్రి అవకతవకలకు పాల్పడ్డారని, విశాఖపట్నం, అచ్యుతాపురం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సుబ్బారావు గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని