logo

Prakasam: ‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన

ఓ మహిళా సిబ్బందితో సీనియర్‌ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Updated : 07 Jul 2024 05:52 IST

అర్ధరాత్రి ఫోన్‌ చేసి మహిళకు వేధింపులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఓ మహిళా సిబ్బందితో సీనియర్‌ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేసి ఆమెతో అనుచితంగా మాట్లాడారు. పై అధికారి కావడంతో ఆ సమయంలో ఫోన్‌ చేసినా... తీసి, మర్యాదపూర్వకంగా మాట్లాడే యత్నం చేశారు. ఆయన మాత్రం అసలు విషయాన్ని పక్కనబెట్టి... ‘మీరు చాలా బాగుంటారు. సెక్సీగా ఉంటారం’టూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనూహ్య ఘటనతో మనస్తాపానికి గురైన సదరు మహిళ... కాల్‌ రికార్డ్‌ ఆధారంతో జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ... తన వద్ద పని చేయాల్సిన అవసరం లేదని, తక్షణమే జిల్లా నుంచి రిలీవ్‌ అయి వెళ్లిపోవాలని సదరు అధికారిని హెచ్చరించినట్లు తెలిసింది. గతంలో ఆయన రాయలసీమ జిల్లాల్లో పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి వ్యక్తిగత ఆసక్తి మేరకు జిల్లాలో పోస్టింగ్‌ ఇప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని