logo

Crime News: మూగ యువతిపై సామూహిక అత్యాచారం

ఆమె ఓ విధి వంచితురాలు..పుట్టుకతో మూగ యువతి కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. మాటలు రాని ఆ దీనురాలికి  మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Updated : 15 Jun 2024 08:24 IST

ముగ్గురు మృగాళ్ల అఘాయిత్యం

ఈనాడు, ఒంగోలు : ఆమె ఓ విధి వంచితురాలు..పుట్టుకతో మూగ యువతి కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. మాటలు రాని ఆ దీనురాలికి  మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన చీమకుర్తి మండలంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో నిరుపేద కుటుంబం ఉంటోంది. వారి కుమార్తె పుట్టుకతోనే మూగ కావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి  పోషణ భారం చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని స్థానికంగా ఉండే ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. మాయమాటలు చెప్పి ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.

స్నేహితులనూ తీసుకొచ్చి..

యువతి దివ్యాంగురాలు కావడంతో ఆ యువకుడు తన స్నేహితులిద్దరిని కూడా కొంతకాలంగా  వెంట తీసుకెళుతున్నాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో బెదిరించి వారు ముగ్గురూ గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం కుమార్తె గర్భం దాల్చిన విషయం గ్రహించిన తల్లి ప్రశ్నించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. బెదిరించి తనపై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేస్తున్నారని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి గురువారం చీమకుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి తరువాత  కేసు నమోదు చేశారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని