logo

Special Express trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్లు

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా డెము, మెము, ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 13 Jan 2022 08:58 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా డెము, మెము, ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైళ్ల పొడిగింపు.. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

* రైలు నంబరు 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 2, 23 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో నంబరు 08580 సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఫిబ్రవరి 3, 24 తేదీల్లో నడపనున్నారు.

* రైలు నంబరు 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 1, 22 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో నంబరు 08586 సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య 2, 23 తేదీల్లో నడపనున్నారు.

* సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నెల 14వ తేదీన నడవనున్న అనకాపల్లి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.


* రైలు నంబరు 17270 నర్సాపూర్‌-విజయవాడ డెము రైలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రతి రోజూ నర్సాపూర్‌లో ఉదయం 9.40కి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడ చేరుతుంది. ఇదే రైలు నంబరు 17269 ఈ నెల 13న విజయవాడలో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.55కి నర్సాపూర్‌ చేరుతుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఉండి, ఆకివీడు, కైకలూరు, మండవల్లి, గుడివాడ, దోసపాడు, తరిగొప్పల, నిడమానూరు, రామవరప్పాడు, మధురానగర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నంబరు 07245 మచిలీపట్నం-గుడివాడ మెము రైలు ఈ నెల 13వ తేదీ నుంచి మచిలీపట్నంలో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.45కి గుడివాడ చేరుతుంది. నంబరు 07871 గుడివాడ-మచిలీపట్నం మెము రైలు 13వ తేదీ రాత్రి 8.35 గంటలకు గుడివాడలో బయలుదేరి 9.55కి మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు పెడన, గుడ్లవల్లేరు స్టేషన్లలో ఆగుతుంది.

* నంబరు 07869 మచిలీపట్నం-గుడివాడ మెము రైలు 14వ తేదీ నుంచి మచిలీపట్నంలో మధ్యాహ్నం 2.25కి బయలుదేరి 3.30కి గుడివాడ చేరుతుంది. నంబరు 07880 గుడివాడ-మచిలీపట్నం మెమూ రైలు 14వ తేదీ నుంచి గుడివాడలో సాయంత్రం 3.45కి బయలుదేరి 5గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. చిలకలపూడి, పెడన, వడ్లమన్నాడు, కౌతరం, గుడ్లవల్లేరు స్టేషన్లలో ఆగుతుంది.

* నంబరు 07898 విజయవాడ-మచిలీపట్నం మెము రైలు 13వ తేదీ నుంచి విజయవాడలో రాత్రి 9.30కి బయలుదేరి అర్ధరాత్రి 12.25 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు తెల్లవారుజాము 3.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 5.55 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ బండి మధురానగర్‌, రామవరప్పాడు, నిడమానూరు, ఉప్పలూరు, తెన్నేరు, తరిగొప్పల, ఇందుపల్లి, దోసపాడు, గుడివాడ, గుడ్లవల్లేరు, కౌతరం, వడ్లమన్నాడు, పెడన, చిలకలపూడి స్టేషన్లలో ఆగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని