logo

Special Trains: 16, 17, 18 తేదీల్లో వికారాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం నుంచి వికారాబాద్‌కు ఈ నెల 16, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు స్టేషన్‌ మేనేజరు జి.మధుబాబు తెలిపారు. నరసాపురంలో రాత్రి 8.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.35కు సికింద్రాబాద్‌, 9.25 గంటలకు వికారాబాద్‌ చేరుతుందన్నారు.

Updated : 15 Jan 2022 07:29 IST

నరసాపురం, న్యూస్‌టుడే: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం నుంచి వికారాబాద్‌కు ఈ నెల 16, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు స్టేషన్‌ మేనేజరు జి.మధుబాబు తెలిపారు. నరసాపురంలో రాత్రి 8.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.35కు సికింద్రాబాద్‌, 9.25 గంటలకు వికారాబాద్‌ చేరుతుందన్నారు. 20 బోగీలతో నడిచే ఈ రైలులో 10 స్లీపర్‌, మూడు థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ ఒకటి, 4 జనరల్‌ బోగీలు ఉంటాయన్నారు. l నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 17న జన సాధారణ రైలు నడుపుతున్నట్లు మధుబాబు తెలిపారు. నరసాపురంలో ఉదయం 10కి బయలుదేరి రాత్రి 9కి సికింద్రాబాద్‌, 11.30 గంటలకు వికారాబాద్‌ చేరుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని