logo

ఈదురుగాలుల బీభత్సం..

జిల్లాలో పలు మండలాల్లో సోమవారం తెల్లవారు జామున ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురిసింది.

Published : 18 Jun 2024 03:54 IST

బొప్పాయి, అరటి పంటకు నష్టం

నేలకొరిగిన అరటి పంట 

జిల్లాలో పలు మండలాల్లో సోమవారం తెల్లవారు జామున ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మైదాన ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గంలో తీవ్రత ఎక్కువగా ఉంది. గాలుల ధాటికి ఎక్కడికక్కడ విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. లావేరు మండలంలోని పాత, కొత్తరౌతుపేట, లక్ష్మీపురం, సూర్యనారాయణపురం, నడుపూరిపేట, వాళ్లేపేట, లక్ష్మీపురం, పటాన్నవానిపేట తదితర గ్రామాల్లోని వందల ఎకరాల్లోని బొప్పాయి, అరటి తోటలు నేలకొరిగాయి. విద్యుత్తు తీగలు తెగిపడటంతో సరఫరాకు    తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  - న్యూస్‌టుడే, లావేరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని