logo

వైభవంగా శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణం

శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది.

Published : 18 Jun 2024 03:56 IST

పుష్పాలంకరణలో స్వామివారు 

శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ఆలయ ధర్మకర్త కల్యాణ గజపతి మహదేవ వర్మ పేరున ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. స్వామిని ప్రత్యేక అలంకరణతో కల్యాణానికి సిద్ధం చేశారు. సాయంత్రం ప్రధాన ఆలయంలో మహిళలు కొట్నం దంచారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి నంది వాహనంపైన ఊరేగించారు. తిరువీధి కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం స్వామి కల్యాణం నిర్వహించారు. - న్యూస్‌టుడే, జలుమూరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని