logo

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌..

జిల్లావ్యాప్తంగా సోమవారం బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులోని జామియా మసీదుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 18 Jun 2024 03:58 IST

 జామియా మసీదు వద్ద ముస్లిం సోదరుడికి శుభాకాంక్షలు చెబుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌   

జిల్లావ్యాప్తంగా సోమవారం బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులోని జామియా మసీదుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఫ్తీ మహమ్మద్‌ జియా ఉర్‌ రెహమాన్‌ రజ్వీ ఖతీబ్, ఇమామ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇమామ్‌ మాట్లాడుతూ త్యాగ నిరతి, విశ్వాసానికి బక్రీద్‌ ప్రతీక అని పేర్కొన్నారు. పలు మసీదుల ప్రతినిధులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.  

 - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని