logo

అటవీ భూముల్లో కంకర తవ్వకాలు

మందస మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో కంకర అక్రమంగా తవ్వుతున్నారు. మందస, సిరిపురం, పొత్తంగి, బుడార్శింగి ప్రాంతాల్లో స్థిరాస్తి లేఅవుట్లు వేయడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

Published : 18 Jun 2024 04:25 IST

చీపి వద్ద తవ్వకాలతో రూపు కోల్పోయిన కొండ 

హరిపురం (మందస), న్యూస్‌టుడే : మందస మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో కంకర అక్రమంగా తవ్వుతున్నారు. మందస, సిరిపురం, పొత్తంగి, బుడార్శింగి ప్రాంతాల్లో స్థిరాస్తి లేఅవుట్లు వేయడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలు వినియోగిస్తుండటంతో కొండలు రూపు కోల్పోతున్నాయి. కంకరను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రైవేటు పనులకు ట్రాక్టరు లోడు రూ.450కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ స్థాయి అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  

  • చీపి, కొండలోగాం, బొగాబంద, గండ్రుగాం ప్రాంతాల్లో అక్రమ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిర్మాణాలకు మట్టి, కంకర వినియోగించినప్పుడు సీనరేజీ కింద ట్రాక్టరు లోడుకు రూ.250 ఖజానాకు జమ అవుతుంది. ప్రైవేటు నిర్మాణాలకు తరలిపోతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 
  • కంకర తవ్వకాలు, తరలింపు పగలు, రాత్రి తేడా లేకుండా బహిరంగంగా చేస్తున్నారు. ట్రాక్టర్లలో అధిక లోడుతో తరలిస్తుండటంతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. అక్రమ తవ్వకాలను అరికట్టే బాధ్యత ఎస్‌ఈబీ అధికారులదే. కొందరు చేతివాటం ప్రదర్శించి అక్రమాలను మరింత ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    నిఘా పెంచుతాం..

మందస మండలంలో మట్టి, కంకర అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా పెంచుతాం. నిబంధనలు పాటించలేదని తేలితే చర్యలు తీసుకుంటాం. అక్రమ వ్యవహారాలకు వినియోగిస్తున్న ట్రాక్టర్లను పోలీసులకు అప్పగిస్తున్నాం.  

- తిరుమలబాబు, తహసీల్దారు, మందస

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు