logo

తూనిక యంత్రాలకు సీళ్లు లేకుంటే చర్యలు

తూనిక యంత్రాలకు సీళ్లు తప్పని సరిగా ఉండాలని లేని వాటిని వినియోగించి పట్టుబడితే చర్యలు తప్పవని తూనికలు కొలతల శాఖ (పలాస) ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీధర్‌ అన్నారు.

Published : 18 Jun 2024 04:27 IST

చల్లవానిపేట వద్ద తూనిక యంత్రాలకు సీళ్లు వేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ 

జలుమూరు, న్యూస్‌టుడే: తూనిక యంత్రాలకు సీళ్లు తప్పని సరిగా ఉండాలని లేని వాటిని వినియోగించి పట్టుబడితే చర్యలు తప్పవని తూనికలు కొలతల శాఖ (పలాస) ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీధర్‌ అన్నారు. జలుమూరు మండలం చల్లవానిపేట, కొమనాపల్లి వద్ద సోమవారం తనిఖీలు చేశారు. 162 ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలకు సీళ్లు వేశారు. వ్యాపారులు అధిక ధరలకు సరుకులు విక్రయించినా, తూకంలో తేడాలు ఉన్నట్లు వినియోగదారులు గుర్తించినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి వ్యాపారి విధిగా తూనిక యంత్రాలకు సీళ్లు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చింతాడ గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని