logo

చూసిన కనులదే భాగ్యం..!

నగరంలోని పలు దేవాలయాల్లో సోమవారం వార్షిక కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Published : 18 Jun 2024 04:30 IST

మొండేటి వీధి లలితాదేవి సమేత శివకామేశ్వరి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం 

శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్‌టుడే: నగరంలోని పలు దేవాలయాల్లో సోమవారం వార్షిక కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గుడి వీధిలోని పంచలింగ క్షేత్రం ఉమారుద్ర కోటేశ్వరాలయం, మొండేటి వీధిలో శిర్డీ సాయి మందిరం ఆవరణలో లలితాదేవి సమేత శివకామేశ్వరి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. చిన్నబజారు వెంకటేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మాధవి తెలిపారు. సంప్రదాయం నాట్యగురుకులం విద్యార్థులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. కళాకారులను అర్చకులు సత్కరించారు. బ్యాంకర్స్‌ కాలనీ శివబాలాజీ ఆలయం, బలగ మెట్టు వద్ద ఉత్తరేశ్వరాలయంలో కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అరసవల్లి రహదారిలోని రమ్యతిరుమల వెంకటేశ్వరాలయంలో లక్ష తులసీదళార్చన పూజలు నిర్వహించారు. పాలకొండ రోడ్డు కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు, భగవద్గీత సామూహిక పారాయణం జరిగింది. ఫాజుల్‌బేగ్‌పేట ఛిందత్తనాథక్షేత్రంలో గణపతి సచ్చిదానంద స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా పాదుకా పూజ, గురుగీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని