logo

ఉద్యోగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.5.17 లక్షల చోరీ

సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫోన్‌ కాల్‌కు స్పందిస్తే ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన గడి కృష్ణారావు బ్యాంకు ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.5,17,030 స్వాహా చేశారు.

Published : 20 Jun 2024 03:26 IST

లావేరు, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫోన్‌ కాల్‌కు స్పందిస్తే ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన గడి కృష్ణారావు బ్యాంకు ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.5,17,030 స్వాహా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేలో పని చేస్తున్న కృష్ణారావు లావేరు మండలం పెద్దరొంపివలస గ్రామంలోని అత్తావారింటికి ఈ నెల 14న వచ్చాడు. అదే రోజు 4జీ నెట్‌వర్క్‌ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు మారాలని ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇప్పుడు నేను 5జీకి మారనని చెప్పారు. అంతే మూడు రోజుల పాటు నెట్‌వర్క్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో కృష్ణారావు ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ కేర్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే నెట్‌వర్క్‌ సేవలను పునరుద్ధరించారు. తరువాత తనకు ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సెస్, ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ.5,17,030 నగదు మాయమైనట్లు గుర్తించారు.  బాధితుడు లావేరు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు          చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై స్వామినాయుడు         తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని