logo

నిద్రమత్తులో నిండు ప్రాణాలు బలి

నిద్రమత్తు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. జాతీయ రహదారిపై టెక్కలి మండలం విక్రమపురం గ్రామ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు.

Published : 20 Jun 2024 03:28 IST

ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి మృత్యువాత

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: నిద్రమత్తు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. జాతీయ రహదారిపై టెక్కలి మండలం విక్రమపురం గ్రామ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన డ్రైవర్లు అసద్‌ అలీ(42), నూరుల్‌ ఇస్లామ్‌(35) పశ్చిమబెంగాల్‌ నుంచి లారీలో బియ్యం లోడును తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో విక్రమపురం వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న మరో లారీని బలంగా ఢీకొన్నారు. ప్రమాద ధాటికి లారీ క్యాబిన్‌ నొక్కుకుపోవడంతో అందులో ఇరుక్కుని ఇద్దరూ మృతి చెందారు. జాతీయ రహదారి సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి టెక్కలి జిల్లా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎస్సై కె.లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని