logo

వ్యవసాయానికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లావేరులో బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

Published : 20 Jun 2024 03:29 IST

లావేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లావేరులో బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, ఇకపై అలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు. ఏన్డీయే ప్రజల ప్రభుత్వమని చెప్పారు. వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రతి రైతు కిసాన్‌ కెడ్రిట్‌ కార్డు తీసుకోవాలన్నారు. రుణాలు పొందినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు 7 శాతం వడ్డీ రాయితీని అందిస్తాయని చెప్పారు. తెదేపా మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విశ్వక్సేన్, రణస్థలం ఏడీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని