logo

వణికించిన ఈదురుగాలులు..

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Published : 20 Jun 2024 03:37 IST

నేలకూలిన భారీ చెట్లు, విద్యుత్తు స్తంభాలు  
న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం 

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పురపాలక కార్యాలయం సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద భారీ వృక్షం విద్యుత్తు తీగలపై పడటంతో స్తంభాలు విరిగిపడ్డాయి. రైల్వే స్టేషన్‌ సమీపంలోని బంగ్లా రోడ్డు వద్ద భారీ వృక్షం ఆటోపై పడటంతో ధ్వంసమైంది. స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ స్థలంలో విరిగిన చెట్టు కొమ్మలు పడటంతో పలు ద్విచక్ర వాహనాల ధ్వంసమయ్యాయి. రైల్వే క్వార్టర్స్‌లో భారీ చెట్లు నేలకొరిగాయి. అధికారులు యంత్రాల సాయంతో వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్తు సరఫరా లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని