logo

తండేల్‌ చిత్ర బృందం సందడి

జిల్లా కేంద్రంలో తండేల్‌ చిత్ర  బృందం బుధవారం సందడి చేసింది. సినీనటుడు నాగచైతన్య, సాయి పల్లవి అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు.

Published : 20 Jun 2024 03:39 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, అరసవల్లి : జిల్లా కేంద్రంలో తండేల్‌ చిత్ర  బృందం బుధవారం సందడి చేసింది. సినీనటుడు నాగచైతన్య, సాయి పల్లవి అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని అనివెట్టి మండపం కిక్కిరిసిపోయింది. అంతకుముందు చిత్రబృందానికి అభిమానులు ఏడురోడ్ల కూడలి వద్ద ఘన స్వాగతం పలికారు. నాగ చైతన్య మాట్లాడుతూ మత్య్సకారులు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రణస్థలం, ఎచ్చెర్ల పరిసర ప్రాంతాల్లో కథ విషయమై మత్స్యకారులతో భేటీ అయ్యామన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాసు, రచయిత కార్తిక్‌ తీడ, నాగచైతన్య అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడు చరణ్, అభిమానులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని