logo

Liquor: ‘సముద్రపు నీటితో మద్యం తయారు చేస్తాం’

సముద్రపు నీటినుంచి మద్యం తయారు చేసే పథకాన్ని రూపొందిస్తామని ఆరుముగం తెలిపారు.

Updated : 15 Jun 2024 08:36 IST

మద్యంప్రియుల సంఘం తరఫున వినూత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్న దృశ్యం 

విల్లివాక్కం, న్యూస్‌టుడే: విగ్రవాండి శాసనసభ ఉప ఎన్నికలో తమిళనాడు మద్యం ప్రియుల సంఘం తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సంఘం కార్యదర్శి ఎంఎస్‌ ఆరుముగం బరిలో నిలుస్తారని తెలిపింది. నియోజకవర్గ పరిధిలోని టాస్మాక్‌ దుకాణాల వద్ద ఖాళీ మద్యం సీసాలు సేకరించి విక్రయించడం ద్వారా వస్తున్న నగదు డిపాజిట్‌గా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికలో విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా మద్యం తాగి మృతి చెందిన కుటుంబంలోని మహిళలకు నెలకు రూ.10 వేలు అందించాలని శాసనసభలో డిమాండ్‌ చేస్తామని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు విద్యా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కోరుతామన్నారు. మద్యం తయారీకి ఉపయోగిస్తున్న చెరకు ఉత్పత్తి చేస్తున్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తామన్నారు. సముద్రపు నీటినుంచి మద్యం తయారు చేసే పథకాన్ని రూపొందిస్తామని ఆరుముగం తెలిపారు. తల విరబోసుకున్న స్థితిలో మంగళసూత్రంతో వినూత్నంగా ఓట్లు అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని