logo

Tamil Nadu: నోట్లమాలతో నామినేషన్‌కు తరలివచ్చిన స్వతంత్ర అభ్యర్థి

విక్రవాండి నియోజకవర్గంలో ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. డీఎంకే మినహా మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు.

Updated : 15 Jun 2024 09:25 IST

నోట్లమాల, చిల్లర సంచులతో స్వతంత్ర అభ్యర్థి అగ్ని ఆళ్వార్‌ 

వేళచ్చేరి, న్యూస్‌టుడే: విక్రవాండి నియోజకవర్గంలో ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. డీఎంకే మినహా మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. మొదటిరోజు ప్రధాన పార్టీలకు చెందిన వారెవరూ నామినేషన్లు వేయలేదు. ఆల్‌ ఇండియా యాంటీ కరప్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అగ్ని ఆళ్వార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నామినేషన్‌ దాఖలు చేశారు. డిపాజిట్‌ డబ్బులు రూ.10 వేలలో కొన్నినోట్లను మాలగా మెడలో వేసుకొని, మరికొంత నగదు చిల్లరగా తీసుకొచ్చి ఎన్నికల అధికారికి అందించారు. డబ్బులను అక్కడి సిబ్బంది లెక్కించారు. అనంతరం పద్మరాజన్, నూర్‌ ముహమ్మద్‌ రాజేంద్రన్‌ తదితరులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

చిల్లర లెక్కిస్తున్న సిబ్బంది  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని