logo

ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశం

‘కళ ఆయ్‌విల్‌ ముదలమైచ్చర్‌’ (సమీక్షా పనులలో ముఖ్యమంత్రి) పేరిట ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వేలూర్‌, రాణిపేట, తిరుప్పత్తూర్‌, తిరువణ్ణామలై జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారుతో సీఎం స్టాలిన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 03 Feb 2023 01:53 IST

సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌ తదితరులు

వేలూర్‌, న్యూస్‌టుడే: ‘కళ ఆయ్‌విల్‌ ముదలమైచ్చర్‌’ (సమీక్షా పనులలో ముఖ్యమంత్రి) పేరిట ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వేలూర్‌, రాణిపేట, తిరుప్పత్తూర్‌, తిరువణ్ణామలై జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారుతో సీఎం స్టాలిన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. వేలూర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఇందులో మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, ఏవీ వేలు, గాంధీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు తదితరులు పాల్గొన్నారు. వేలూర్‌లోని వేర్వేరు పాఠశాలల్లోనూ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకచోట విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని