logo

సెంథిల్‌కు రిమాండు

మైలాడుదురైలోని ధరుమపురం ఆధీనం 27వ గురు మహా సన్నిధానంగా శ్రీలశ్రీ మాసిలామణి దేశికన్‌ వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని, వాటిని ఆపాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని కొందరు ఫోన్‌ చేసి బెదిరించారు.

Published : 13 Jun 2024 00:58 IST

సెంధిల్‌ను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు 

వేళచ్చేరి, న్యూస్‌టుడే: మైలాడుదురైలోని ధరుమపురం ఆధీనం 27వ గురు మహా సన్నిధానంగా శ్రీలశ్రీ మాసిలామణి దేశికన్‌ వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈయనకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని, వాటిని ఆపాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని కొందరు ఫోన్‌ చేసి బెదిరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న జిల్లా భాజపా అధ్యక్షుడు అగోరంతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన ఐదుగురి కోసం గాలించసాగారు. ఆధీనం సహాయకుడు వారణాశిలో దాగి ఉన్నట్లు మైలాడుదురై పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందం రెండు రోజుల కిత్రం వారణాసికి చేరుకొన్నారు. అక్కడ గుండు గీయించుకొని మారు వేషంలో ఉన్న సెంథిల్‌ను అరెస్టుచేసి మంగళవారం బెంగుళూర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా తీసుకు వచ్చి మైలాడుదురై పోలీసులకు అప్పగించారు. పోలీసులు మంగళవారం రాత్రి సెంథిల్‌ను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని