logo

విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై ప్రమాణ స్వీకారం

కన్నియాకుమరి జిల్లా విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై కత్‌బర్ట్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే విజయధరణి కాంగ్రెస్‌ నుంచి వైదొలగి భాజపాలో చేరడంతో ఆమె పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

Published : 13 Jun 2024 01:16 IST

ప్రమాణస్వీకారం చేయిస్తున్న సభాపతి 

చెన్నై, న్యూస్‌టుడే: కన్నియాకుమరి జిల్లా విళవంకోడు ఎమ్మెల్యేగా తారగై కత్‌బర్ట్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే విజయధరణి కాంగ్రెస్‌ నుంచి వైదొలగి భాజపాలో చేరడంతో ఆమె పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తారగై కత్‌బర్ట్‌ విజయం సాధించారు. సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో సభాపతి అప్పావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఏవీ వేలు, రాజకన్నప్పన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, ఎంపీ విజయ్‌ వసంత్, ఎమ్మెల్యేలు రాజేశ్‌ దాస్, రూబి మనోహరన్, ప్రిన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని