logo

29 వరకు శాసనసభ సమావేశాలు

శాసనసభ సభమావేశాలు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి. సభాపతి అప్పావు అధ్యక్షతన బుధవారం బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తొలిరోజు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పుగళేంది మృతికి సంతాపం తెలుపనున్నారు.

Published : 13 Jun 2024 01:11 IST

చెన్నై, న్యూస్‌టుడే: శాసనసభ సభమావేశాలు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి. సభాపతి అప్పావు అధ్యక్షతన బుధవారం బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తొలిరోజు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పుగళేంది మృతికి సంతాపం తెలుపనున్నారు. 21న జలవనరులు, ప్రకృతి వనరులు, కార్మిక సంక్షేమం, గృహ నిర్మాణం, ప్రొహిబిషన్‌-ఎక్సైజ్, దివ్యాంగులు, సాంఘిక సంక్షేమం, 22న స్థానిక స్వపరిపాలన-జలసరఫరా, గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్, వ్యవసాయం, పశుసంవర్థక-మత్స్య, పాడి పరిశ్రమలు తదితర శాఖల పద్దులపై చర్చ జరగనుంది. 23న(ఆదివారం) ప్రభుత్వ సెలవు. 24న ఉన్నత విద్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ-ప్రకృతి విపత్తులు, పాఠశాల విద్య, న్యాయ పరిపాలన, జైళ్లు-సంస్కరణ సేవలు, న్యాయ, సమాచార-ప్రచారం, స్టేషనరీ-ముద్రణ, తమిళ అభివృద్ధి, 25న రహదారులు-చిన్న ఓడరేవులు, భవనాలు, పర్యావరణం-వాతావరణ మార్పు, అటవీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల సంక్షేమం, రవాణా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల పద్దులపై చర్చ జరగనుంది. 26న అభివృద్ధి, ప్రత్యేక ప్రయత్నాలు, ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం-కళలు, సాంస్కృతికం, వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, హిందూ దేవాదాయ, ధర్మాదయశాఖలు, 27న యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ప్రత్యేక పథక అమలు, చేనేత, జౌళి, సహకార, ఆహార, వినియోగదారుల భద్రత, 28న ఎంఎస్‌ఎంఈ, ఆరోగ్య, ప్రజా సంక్షేమం, సమాచార సాంకేతికత, డిజిటల్‌ సేవలు, పోలీసు, అగ్నిమాపక సహాయక సేవలు, 29న పోలీసు, అగ్నిమాపక సహాయక సేవలు తదితర శాఖల పద్దులపై చర్చలు జరగనున్నాయి. బిల్లులను పరిశీలించి ఓటింగ్‌ ద్వారా నెరవేర్చనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని