logo

‘భయమరియా బ్రమ్మై’ టీజర్‌ విడుదల

వర్థమాన దర్శకుడు రాహుల్‌ కపాలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భయమరియా బ్రమ్మై’. గురు సోమసుందరం, జాన్‌ విజయ్, హరిశ్‌ ఉత్తమన్, వినోద్‌ సాగర్, విశ్వంత్, సాయి ప్రియాంక రూత్, దివ్య గణేశ్, హరీశ్‌ తదితరులు నటించారు.

Published : 13 Jun 2024 01:16 IST

చెన్నై, న్యూస్‌టుడే: వర్థమాన దర్శకుడు రాహుల్‌ కపాలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భయమరియా బ్రమ్మై’. గురు సోమసుందరం, జాన్‌ విజయ్, హరిశ్‌ ఉత్తమన్, వినోద్‌ సాగర్, విశ్వంత్, సాయి ప్రియాంక రూత్, దివ్య గణేశ్, హరీశ్‌ తదితరులు నటించారు. కొద్దిరోజుల కిందట ఫస్ట్‌లుక్‌ పోస్టరును విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం టీజర్‌ విడుదలైంది. ఇందులో.. హత్య, పోలీసు, హంతకుడు తదితర ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇవి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.


లండన్‌ జాతీయ పురస్కారానికి  ‘కెప్టెన్‌ మిల్లర్‌’

సత్యజ్యోతి ఫిలిమ్స్‌ విడుదల చేసిన పోస్టరు 

చెన్నై, న్యూస్‌టుడే: ధనుష్, అరుణ్‌ మాధేశ్వరన్‌ కాంబినేషన్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఆంగ్లేయుల హయాంలో భారతీయులపై జరిగిన అకృత్యాలకు అద్దం పట్టే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్‌ కిషన్‌ తదితరులు నటించారు. ఈ నేపథ్యంలో 10వ లండన్‌ జాతీయ పురస్కారాలకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్‌ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎక్స్‌ పేజీలో ఓ పోస్టరు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని