logo

సవుక్కు శంకర్‌ విడుదలైన కేసులో ఏడేళ్ల తర్వాత అప్పీల్‌

టెలిఫోన్‌ రహస్య సంభాషణలు విడుదల చేసినట్లు నమోదైన కేసు నుంచి సవుక్కు శంకర్‌ విడుదలవడానికి వ్యతిరేకంగా ఏడేళ్ల తర్వాత సీబీసీఐడీ హైకోర్టులో అప్పీల్‌ చేసింది.

Published : 14 Jun 2024 00:53 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: టెలిఫోన్‌ రహస్య సంభాషణలు విడుదల చేసినట్లు నమోదైన కేసు నుంచి సవుక్కు శంకర్‌ విడుదలవడానికి వ్యతిరేకంగా ఏడేళ్ల తర్వాత సీబీసీఐడీ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ డైరక్టరేట్‌ కార్యాలయం రహస్య విభాగంలో ప్రత్యేక సహాయకుడిగా 2008లో విధులు నిర్వహించిన సవుక్కు శంకర్‌ కొన్ని రహస్య టెలిఫోన్‌ సంభాషణలు చోరీ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు సీబీసీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన సెషన్స్‌ కోర్టు తగిన ఆధారాలు లేవని సవుక్కు శంకర్‌ని విడుదల చేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఏడేళ్ల తర్వాత ప్రస్తుతం సీబీసీఐడీ తరఫున మద్రాసు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. సవుక్కు శంకర్‌ నాలుగు వారాల్లో జవాబివ్వాలని జస్టిస్‌ దండపాణి ఉత్తర్వులు ఇచ్చి విచారణ వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని