logo

వివేకానంద రాక్‌ నుంచి తిరువళ్లువర్‌ విగ్రహం వరకు నడక దారి వంతెన

కన్నియాకుమారిలో వివేకానంద రాక్‌ మెమోరియల్‌ నుంచి తిరువళ్లువర్‌ విగ్రహం వరకు నడకదారి వంతెన త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఇక్కడ వంతెన నిర్మాణం జరపాలన్నది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆకాంక్ష.

Published : 14 Jun 2024 01:47 IST

రూ.37 కోట్లతో నిర్మాణం

వడపళని, న్యూస్‌టుడే: కన్నియాకుమారిలో వివేకానంద రాక్‌ మెమోరియల్‌ నుంచి తిరువళ్లువర్‌ విగ్రహం వరకు నడకదారి వంతెన త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఇక్కడ వంతెన నిర్మాణం జరపాలన్నది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆకాంక్ష. రూ.37 కోట్లతో హైవేస్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటవనుందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డీఎంకే అధికారంలోకి వచ్చాక హైవేస్‌ విభాగానికి పలు ప్రాజెక్టులు అప్పగించింది. అందులో పలు నదుల మీదుగా 277 వంతెనలు రానున్నాయి.

నిర్మాణంలో మరిన్ని..

అదనంగా మరో 13 వంతెనలు రూ.400 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయి. 577 కి.మీ. మేర రూ.4,984 కోట్లతో నాలుగు వరుసలతో కొత్తగా రోడ్డు వేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.2,465 కోట్లతో 1,710 కి.మీ. వరకు రెండు వరుసలు, రూ.1,610 కోట్లతో 4,581 కి.మీ. సింగిల్‌ లేన్‌తో నిర్మాణం జరపనుంది. రాష్ట్రంలోని 1,281 కాజ్‌వేలపై ఎత్తైన వంతెనలు నిర్మించనుంది.

మరమ్మతులు..

మూడేళ్లుగా హైవేస్‌ విభాగం 4,581 కి.మీ. వరకు రూ.1,610 కోట్లతో రోడ్లను మరమ్మతులు చేసి, అవసరమైన  చోట్ల కొత్త నిర్మాణాలు చేపట్టింది. అక్కడక్కడా కొన్ని పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. చెన్నై అన్నాసాలైలోని తేనాంపేట నుంచి సైదాపేట వరకు వాహనాలకు ఇబ్బంది లేకుండా వంతెన నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయి. 22 ప్రాంతాల్లో రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద రూ.836 కోట్లతో వంతెనలు అందుబాటులోకి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలు పురస్కరించుకుని రాష్ట్రంలోని జాతీయరహదారుల్లో పచ్చదనం కోసం 4.5 లక్షల మొక్కలు నాటినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని