logo

యోగాలో శ్రీరామచంద్ర విద్యార్థుల రికార్డు

భుజంగాసనంలో శ్రీరామచంద్ర ఉన్నత విద్య, పరిశోధన (ఎస్‌ఆర్‌ఐహెచ్‌ఈఆర్‌) విద్యార్థులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

Published : 14 Jun 2024 01:46 IST

 భుజంగాసనంలో విద్యార్థులు

చెన్నై: భుజంగాసనంలో శ్రీరామచంద్ర ఉన్నత విద్య, పరిశోధన (ఎస్‌ఆర్‌ఐహెచ్‌ఈఆర్‌) విద్యార్థులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా 1,240 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది బుధవారం 2.54 నిమిషాలపాటు భుజంగాసనం ప్రదర్శించి ఈ రికార్డును సృష్టించారు. దీనిని ప్రపంచ రికార్డుగా వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించింది. ఈ సందర్భంగా దాని మేనేజర్‌ క్రిస్టోఫర్‌ టేలర్‌ సంబంధిత ధ్రువపత్రాన్ని మైండ్‌ బాడీ మెడిసిన్, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాధిపతి డాక్టర్‌ మాతంగికి అందించారు. కార్యక్రమంలో శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ మహేశ్‌ వక్కముడి, రిజిస్ట్రార్‌ రూపా నాగరాజన్, ముఖ్య సలహాదారు టీకే పార్థసారథి, యోగా నిపుణులు డాక్టర్‌ కవితా మోహన్, యోగా ట్రైనర్లు బిజు దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ధ్రువపత్రం అందుకుంటున్న కళాశాల నిర్వాహకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు