logo

వైద్య సాయం చేసేందుకు అత్యాధునిక డ్రోన్‌

తంజావూరు శ్రీనగర్‌ కోపరేటివ్‌ కాలనీకి చెందిన దినేష్‌ (33) ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి జర్మనీలో పని చేస్తున్నారు.

Published : 14 Jun 2024 01:43 IST

రూపొందించిన యువకుడికి ప్రశంసలు

తయారు చేసిన డ్రోన్‌ చూపుతున్న దినేష్‌

సైదాపేట, న్యూస్‌టుడే: తంజావూరు శ్రీనగర్‌ కోపరేటివ్‌ కాలనీకి చెందిన దినేష్‌ (33) ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి జర్మనీలో పని చేస్తున్నారు. దినేష్‌ తన ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ప్రభుత్వంతో కలిసి వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు అత్యాధునిక డ్రోన్‌ తయారు చేశారు. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పాముకాటు, ప్రసూతి సంబంధ మరణాలు నివారించేందుకు డ్రోన్‌ను రూపొందించారు. దీని గురించి దినేష్‌ మాట్లాడుతూ... తాను రూపొందిన డ్రోన్‌ హెలికాప్టర్‌లా ఎగిరి ల్యాండ్‌ అయ్యేలా ఉంటుందన్నారు. రాత్రిపూట కూడా పనిచేస్తుందని చెప్పారు. 155 కి.మీ వేగంతో 180 కి.మీ దూరం ప్రయాణిస్తుందన్నారు. 7 కిలోల బరువు వరకు అవయవాలను, మందులను తీసుకెళ్లొచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడినుంచైనా డ్రోన్‌ను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ డ్రోన్‌ ద్వారా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన మందులను నగర ప్రాంత ఆస్పత్రుల నుంచి తరలించవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా అయ్యి మరణాలు తగ్గే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని