logo

లాక్‌డౌన్‌ తొలి లిరికల్‌ వీడియో విడుదల

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో వర్థమాన దర్శకుడు ఏ.ఆర్‌.జీవ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాక్‌డౌన్‌’. అనుపమా పరమేశ్వరన్‌ నటించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది.

Published : 14 Jun 2024 01:45 IST

చెన్నై, న్యూస్‌టుడే: లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో వర్థమాన దర్శకుడు ఏ.ఆర్‌.జీవ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాక్‌డౌన్‌’. అనుపమా పరమేశ్వరన్‌ నటించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. కరోనా కాలంలోని యధార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని నిర్మించారు. చిత్రం తొలి పాట ‘లావా లావా’ను చిత్రబృందం బుధవారం సాయంత్రం విడుదల చేసింది. స్నేహన్‌ రాసిన ఈ పాటను ప్రియా జెర్సన్‌ పాడారు. పాట లిరికల్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.


ఇళయరాజా ఆశీర్వాదం పొందిన ప్రేమ్‌జీ దంపతులు

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్రేమ్‌జీ వివాహం 9వ తేదీ తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రేమ్‌జీ పెదనాన్నయైన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా హాజరుకాలేదు. దీంతో ఆ కుటుంబాల మధ్య స్పర్థలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌జీ దంపతులు ఇళయరాజాను నేరుగా కలిసి ఆశీస్సులు తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని