logo

తుదిదశ చిత్రీకరణలో విడాముయర్చి

నటుడు అజిత్‌కుమార్, దర్శకుడు మగిళ్‌ తిరుమేని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్‌పై నిర్మితమవుతోంది.

Published : 18 Jun 2024 01:28 IST

అర్జున్‌

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు అజిత్‌కుమార్, దర్శకుడు మగిళ్‌ తిరుమేని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్‌పై నిర్మితమవుతోంది. అర్జున్, ఆరవ్, రెజినా కసాండ్రా, ప్రియా భవానీశంకర్‌ తదితరులు ముఖ్య తారాగణం. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. గతేడాది అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభమైంది. ఎక్కువశాతం అజెర్‌బైజాన్‌ దేశంలో జరిగింది. టైటిల్‌ లుక్‌ తప్ప ఇప్పటివరకు ఇతర ప్రకటనలు వెలువడలేదు. ఈ నేపథ్యంలో నగరంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిత్రానికి సంబంధించిన కొన్ని వివరాలను అర్జున్‌ వెల్లడించారు. మిగతా చిత్రాలకు భిన్నంగా ‘విడాముయర్చి’ ఉంటుందని తెలిపారు. ఇంకా 20 నుంచి 30 శాతం చిత్రీకరణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. తుదిదశ చిత్రీకరణ పనులు ఈ నెలలో అజైర్‌బైజాన్‌లో మొదలవుతాయన్నారు. 


ఫీనిక్స్‌ వీళాన్‌ టీజర్‌ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫీనిక్స్‌ వీళాన్‌’. బ్రేవ్‌ మ్యాన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న చిత్రానికి అనల్‌ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్‌ సి.ఎస్‌ సంగీతం సమకూర్చుతున్నారు. టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో తండ్రి విజయ్‌ సేతుపతికి సూర్య శాలువా కప్పి పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


శరవేగంగా రాకెట్‌ డ్రైవర్‌ చిత్రీకరణ

చిత్ర పోస్టరు 

చెన్నై, న్యూస్‌టుడే: ‘స్టోరీస్‌ బై ది షోర్‌’ పతాకంపై నిర్మాత అనిరుద్‌ వల్లభ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రాకెట్‌ డ్రైవర్‌’. వర్ధమాన దర్శకుడు శ్రీరామ్‌ ఆనంద శంకర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఫాంటసీ, డ్రామా, హాస్య, వినోదభరిత అంశాలతో రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా విశ్వంత్‌ హీరోగా పరిచయమవుతున్నారు. నాగ విశాల్, కాత్తాడి రామమూర్తి, సునయిన, జగన్‌ తదితరులు ఇతర నటీనటులు. చిత్రీకరణ పనులు ముమ్మరంగా సాగుతుండగా ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని