logo

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజు అనంతరం ఒకరికొకరు పండగ శుభాంకాంక్షలు తెలుపుకొన్నారు.

Published : 18 Jun 2024 01:32 IST

వేలూర్‌లో నమాజు చేస్తున్న ముస్లింలు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజు అనంతరం ఒకరికొకరు పండగ శుభాంకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం ఇళ్లకు చేరుకుని మేకలను ఖుర్బానీ ఇచ్చారు. బిర్యాని వండి బంధుమిత్రులకు పెట్టారు. చెన్నై డాన్‌బాస్కో పాఠశాల మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కోయంబత్తూరు కరుంబుకడైలోని ఇస్లాం మెట్రిక్‌ పాఠశాలలో జరిగిన నమాజులో వందలాది మంది పాల్గొన్నారు. ఊత్తుకోట, పెరియపాళ్యం, గుమ్మిడిపూండి, పొన్నేరి, రెడ్‌హిల్స్, వేలూర్, తిరుపత్తూరు, ఆంబూరు తదితర ప్రాంతాల్లో కోలాహలంగా జరుపుకొన్నారు.

కన్నియాకుమరిలో.. 

  • ప్యారిస్‌: కన్నియాకుమరి జిల్లా నాగర్‌కోవిల్‌ కొట్టార్‌ ఇళంకడై పావాకష్మి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తక్కలై వద్ద తమిళనాడు తౌహిత్‌ జమాద్‌ తరఫున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో 2 వేల మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు.
  • పళ్లిపట్టు: పళ్లిపట్టు ఈద్గా మైదానంలో జమాత్‌ పేష్‌ ఇమామ్‌ మహమద్‌ ఉస్మాన్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు పళ్లిపట్టు, వెళిగరం, కత్తిరపల్లి, అమ్మపల్లి ప్రాంతాలకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు.

కాంచీపురంలో.. 

  • కాంచీపురం: బక్రీద్‌ పండుగ సందర్భంగా సోమవారం కాంచీపురం జిల్లా తమిళనాడు తౌహీద్‌ జమాత్‌ తరఫున జిల్లాలో 9 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంచీపురం వలీమహమ్మద్‌పేటలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాధ్యమిక పాఠశాల ప్రాంగణంలో జరిగిన ప్రార్థనల్లో తౌహీద్‌ జమాత్‌ రాష్ట్ర వక్త దౌహీద్‌ ప్రసంగించారు. జిల్లా డిప్యూటీ కార్యదర్శి అన్సారి, వైద్య విభాగం తరఫున సర్బుద్దీన్, కాంచీపురం తౌహీద్‌ జమాత్‌ శాఖ అధ్యక్షుడు సాహుల్‌ హమీద్, కార్యదర్శి యూసూఫ్, నిర్వాహకులు పాల్గొన్నారు.
  • వేలూర్‌: వేలూర్, కస్బాఆరియన్‌పాళ్యం, పరప్పాడి, సత్తువాచారి, కాట్పాడి, ఎంజీఆర్‌నగర్, సైదాపేట, పళ్లిపాళ్యం తదితర ప్రాంతాల్లో ముస్లింలు బక్రీద్‌ పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గా మైదానాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

చెన్నైలో చిన్నారితో ప్రార్థనకు తరలివచ్చిన తల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు