logo

కావేరి నీటిని పొందేందుకు చర్యలు చేపట్టాలి: ఓ పన్నీర్‌సెల్వం

ముఖ్యమంత్రి స్టాలిన్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడి తమిళనాడుకు దక్కాల్సిన కావేరి నీటిని పొందేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు.

Published : 18 Jun 2024 01:38 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడి తమిళనాడుకు దక్కాల్సిన కావేరి నీటిని పొందేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... సుప్రీంకోర్టు, కావేరి ట్రైబ్యునల్‌ తుది తీర్పు ప్రకారం తమిళనాడుకు ప్రతినెలా కొంత నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. అయితే సకాలంలో నీటి విడుదల జరగట్లేదన్నారు. ఈ ఏడాది మేట్టూరు జలాశయంలో తగినంత నీరు లేకపోవడంతో కురువై సాగుకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు వాటా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని