logo

అన్నాడీఎంకేలో సరైన నాయకత్వం లేదు

సరైన నాయకత్వం లేకపోవడంతోనే అన్నాడీఎంకే విచ్ఛిన్నం అవుతోందని ఎంపీ కార్తి చిదంబరం పేర్కొన్నారు. కారైక్కుడిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

Published : 18 Jun 2024 01:40 IST

విలేకరులతో మాట్లాడుతున్న కార్తిచిదంబరం 

ప్యారిస్, న్యూస్‌టుడే: సరైన నాయకత్వం లేకపోవడంతోనే అన్నాడీఎంకే విచ్ఛిన్నం అవుతోందని ఎంపీ కార్తి చిదంబరం పేర్కొన్నారు. కారైక్కుడిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ఎప్పుడూ మత ఐక్యతకు అండగా ఉంటుందన్నారు. నీట్‌ ఓ మోసపూరిత పరీక్ష అని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. ప్రశ్నపత్రం లీకవడం, గ్రేస్‌ మార్కులు కలపడం వంటి పలు అవకతవకలు జరిగాయన్నారు. అందుకే నీట్‌ను తమిళనాడు మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయని తెలిపారు. కొడనాడు కేసుని త్వరగా విచారించి తీర్పు వెలువరించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని