logo

పునఃపరిశీలించే వరకు కొత్త చట్టాల అమలు ఆపేయాలి

భారతీయ శిక్షా స్మృతికి బదులు రూపొందిన మూడు కొత్తచట్టాలను పునఃపరిశీలించే దాకా వాటి అమలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు.

Published : 19 Jun 2024 00:13 IST

కేంద్ర హోంశాఖకు స్టాలిన్‌ లేఖ

చెన్నై, న్యూస్‌టుడే: భారతీయ శిక్షా స్మృతికి బదులు రూపొందిన మూడు కొత్తచట్టాలను పునఃపరిశీలించే దాకా వాటి అమలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందులో.. ప్రస్తుతమున్న భారతీయ శిక్షా స్మృతి-1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973లను రద్దు చేసి మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో రాష్ట్రం ఎదుర్కొనే కొన్ని ఆక్షేపణలు, సమస్యలను తన లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నట్టు తెలిపారు. తగిన చర్చలు, సూచనలు లేకుండా కొత్త చట్టాలను తొందరపాటుతో రూపొందించారని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అని ఆ మూడు చట్టాలకు సంస్కృతంలో పేరుపెట్టారని పేర్కొన్నారు. ఇది భారతీయ రాజ్యంగం 348వ అధికరణాన్ని అతిక్రమించడమేనని తెలిపారు. పార్లమెంట్‌లో నెరవేర్చే అన్ని చట్టాలు ఆంగ్లంలో ఉండటం తప్పనిసరి అన్నారు. ఈ చట్టాల్లో కొన్ని ప్రాథమిక దోషాలు, కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని