logo

భూగర్భ డ్రైనేజీలో పడిన యువతి

కోవై నగరంలో ప్రధాన రహదారుల్లో ఒకటైన వంద అడుగుల రహదారిలో రోడ్డుకు రెండు వైపులా వ్యాపార సంస్థలు ఉన్నాయి.

Published : 19 Jun 2024 00:26 IST

తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌.. సీసీటీవీ కెమెరా దృశ్యం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోవై నగరంలో ప్రధాన రహదారుల్లో ఒకటైన వంద అడుగుల రహదారిలో రోడ్డుకు రెండు వైపులా వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటి ముందే రెండు వైపులా కోవై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం భూగర్భ డ్రైనేజీలో పూడికను తీశారు. కాని మ్యాన్‌ హోల్‌పై ఉన్న మూతలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు. ఈ స్థితిలో సోమవారం సాయంత్రం అటు వైపు వెళుతున్న యువతి తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌ గుండా భూగర్భ డ్రైౖనేజీలో పడింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీశారు. కాలికి తీవ్ర గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి డ్రైనేజీ పడే సీసీటీవీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో కార్పొరేషన్‌ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి తెరచి ఉన్న మ్యాన్‌ హోల్‌పై సిమెంటు స్లాబ్‌తో మూతలు మూశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని