logo

నేడు సార్‌ ట్రైలర్‌

నట దర్శకుడు బోస్‌ వెంకట్‌ దర్శకత్వంలో విమల్‌ ప్రధానపాత్రధారిగా రూపొందిన సినిమా ‘మా.పొ.సి’. ఫస్ట్‌లుక్‌ మేలో విడుదలైంది.

Published : 19 Jun 2024 00:37 IST

చిత్రం పోస్టరు

చెన్నై, న్యూస్‌టుడే: నట దర్శకుడు బోస్‌ వెంకట్‌ దర్శకత్వంలో విమల్‌ ప్రధానపాత్రధారిగా రూపొందిన సినిమా ‘మా.పొ.సి’. ఫస్ట్‌లుక్‌ మేలో విడుదలైంది. అణగారిన వర్గాలకు విద్యాహక్కు అందించడానికి పోరాడే ఇద్దరు వ్యక్తుల కథాంశంతో రూపొందింది. అనివార్య కారణాలతో టైటిల్‌ను ‘సార్‌’గా మార్చారు. బుధవారం సాయంత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


మెయ్యళగన్‌ ప్రత్యేక పోస్టరు విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు సూర్యకు చెందిన 2డి పతాకంపై ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మెయ్యళగన్‌’. గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చుతున్నారు. కార్తి, అరవిందస్వామి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అరవిందస్వామి 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం ప్రత్యేక పోస్టరు విడుదల చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.


ఓటీటీలోకి రసవాతి

‘రసవాతి’ పోస్టరు

చెన్నై, న్యూస్‌టుడే: శాంతకుమార్‌ దర్శకత్వంలో అర్జున్‌దాస్, తన్యా రవిచంద్రన్, రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్‌ తదితరులు నటించి మే 10న విడుదలైన చిత్రం ‘రసవాతి’. ‘అల్‌కెమిస్ట్‌’ ట్యాగ్‌లైన్‌ జోడించారు. ప్రేక్షకుల ఆదరణాభిమానులు పొందిన ఈ చిత్రం డిజిటల్‌ హక్కులు ఆహా ఓటీటీ పొందింది. 21న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంపై చిత్రం విడుదల కానుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని