logo

పునరావాస గృహాలు సిద్ధం

పునరావాసానికి నిర్మించిన 2,684 గృహలు సిద్ధమయ్యాయని అర్బన్‌ హాబిటట్‌ డెవలప్‌మెంట్‌ బోర్టు అధికారులు తెలిపారు.

Published : 19 Jun 2024 00:46 IST

పెరుంబాక్కంలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహాలు

వేళచ్చేరి, విల్లివాక్కం, న్యూస్‌టుడే: పునరావాసానికి నిర్మించిన 2,684 గృహలు సిద్ధమయ్యాయని అర్బన్‌ హాబిటట్‌ డెవలప్‌మెంట్‌ బోర్టు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు దళారుల బారినపడి మోసపోవద్దని సూచించారు. చెన్నై పెరుంబాక్కం, సెమ్మంజేరి పరిధిలోని 27,212 పురాతన గృహాలను తొలగించి రూ.483.45 కోట్లతో 5, 8, 10 అంతస్తుల్లో 2,684 గృహాలు నిర్మించారు. ప్రతి బ్లాక్‌లో విద్యుత్తు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణదారులు ఉన్నాయి. ఒక్కో ఇంటిని రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇంటి విస్తీర్ణాన్ని అనుసరించి రూ.5.25 లక్షల నుంచి రూ.6.70 లక్షల వరకు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. నదుల పునరుద్ధరణ ట్రస్ట్‌ ద్వారా బకింగ్‌హామ్‌ కాలువ, అడయారు నిర్వాసితులకు ఈ గృహాలను కేటాయించారు. మిగిలిన ఇళ్లు త్వరలో ప్రారంభించనున్నారు.

దళారులను నమ్మొద్దు..

కొద్దిరోజులుగా కొందరు దళారులు ఈ గృహాలను చూపించి ప్రజల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. 2018లో నిర్మించిన గృహాలకు నకిలీ కేటాయింపు ధ్రువపత్రాలు తయారు చేసి కోట్లాది రూపాయలను మోసానికి పాల్పడిన 8 మందిని అరెస్టు చేశామన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు