logo

ముఖ్యమంత్రికి జస్టిస్‌ చంద్రు కమిటీ నివేదిక

పాఠశాల విద్యార్థుల్లో సద్భావన కలిగించే మార్గదర్శకాలు రూపొందించడానికి ఏర్పాటైన జస్టిస్‌ చంద్రు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి అందించింది.

Published : 19 Jun 2024 00:50 IST

ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తున్న జస్టిస్‌ చంద్రు

చెన్నై, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థుల్లో సద్భావన కలిగించే మార్గదర్శకాలు రూపొందించడానికి ఏర్పాటైన జస్టిస్‌ చంద్రు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. పాఠశాల విద్యార్థుల్లో కుల, వర్గ భేధాలతో ఏర్పడే హింసను నిర్మూలించడానికి, సద్భావాన్ని కలిగించడానికి, వాటికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్‌ చంద్రు మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి తన కమిటీ రూపొందించిన నివేదికను సమర్పించారు. వెంట పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్‌ మీనా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కుమరగురుభరన్, పాఠశాల విద్యా సంచాలకులు అరివొళి తదితరులు ఉన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని